అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం: ఎస్సై

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం: ఎస్సై

MHBD: ఇనుగుర్తి మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై కరుణాకర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక తరలించాల్సి వస్తే, తప్పనిసరిగా తహశీల్దార్ నుంచి ముందస్తు అనుమతి పత్రం పొందాలని సూచించారు.