మహిళల ఆరోగ్యానికి స్క్రీనింగ్ పరీక్షలు
BDK: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో మంగళవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హెల్త్ మిషన్ 100 డేస్లో హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జమలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని SHG గ్రూపు మహిళలకు ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు.