భయంతో కాదు.. ఇష్టంతో చదవండి: ఎమ్మెల్యే బొజ్జు

భయంతో కాదు.. ఇష్టంతో చదవండి: ఎమ్మెల్యే బొజ్జు

ADB: ఉట్నూర్ మండలం లక్కారంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. విద్యార్థులు భయపడుతూ కాకుండా ఇష్టంతో చదువుతేనే పరీక్షలో సులభంగా రాణించగలరన్నారు. అలాగే పరీక్షలో మండల జిల్లాస్థాయి టాపర్లుగా నిలిచిన వారికి బహుమతులను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఆశన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.