'హోంగార్డు కుటుంబానికి సాయం'

కృష్ణా: 2025 జూన్ 5న ఓఎన్జీసీ బంటుమిల్లి వద్ద విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ L.రవిబాబు మరణించారు. జిల్లా హోంగార్డుల అందరి వేతనాన్ని వన్డే కాంట్రిబ్యూషన్ రూపంలో రూ.3,79,140 చెక్కును జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆయన భార్య రజినీ దేవికి గురువారం అందజేశారు. అవసరమైన వేళ పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి ఎస్పీ హామీ ఇచ్చారు.