గాంధీ భవన్‌లో ఘనంగా సర్దార్ పాపన్న వర్ధంతి
HYD: గాంధీ భవన్‌లో టీపీసీసీ కల్లు గీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ కల్లు గీత కార్మిక ఛైర్మన్ నాగరాజు, వైస్ ఛైర్మన్ కుమార్ రావు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని, ఆయన సేవలు మరువలేనివని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.