భారీగా నల్ల బెల్లం సీజ్.. ముగ్గురు అరెస్ట్

భారీగా నల్ల బెల్లం సీజ్.. ముగ్గురు అరెస్ట్

నల్గొండ అసిస్టెంట్ కమిషనర్(ఎన్‌ఫోర్స్‌మెంట్) బీ. సంతోష్ ఆదేశాల మేరకు, ఏఈఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ. కిషన్ పర్యవేక్షణలో ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దేవరకొండ మండలంలో భారీ దాడులు నిర్వహించారు. పడమటి పల్లి క్రాస్ రోడ్ సమీపంలో జరిపిన ఈ రూట్ వాచ్‌లో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం, పటిక మరియు నాటు సారాను పట్టుకున్నారు.