మల్దకల్ జూనియర్ కళాశాలలో సమస్యలు

మల్దకల్ జూనియర్ కళాశాలలో సమస్యలు

GDWL: మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మురుగునీరు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల విష పురుగులు వచ్చే అవకాశం ఉందని, విద్యార్థులు అనారోగ్యాల బారిన పడతారని మంగళవారం పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం కళాశాల నీటిలో నిరసన తెలిపారు.