అనంతపురం బస్ స్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు
ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం త్రీటౌన్ పోలీసులు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా నార్కోటిక్స్ డిటెక్షన్ జాగిలం 'టైగర్' సహాయంతో ఈ తనిఖీలు చేపట్టారు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పర్యవేక్షణలో ప్రయాణికుల లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు.