ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

KNR: కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పెయింటింగ్, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.