‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో రోడ్డు భద్రతకు అవగాహన
సూర్యాపేటలో పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం ప్రజలలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నది. ఆర్టీసీ డిపోలో ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రమాదాల బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున డ్రైవర్ క్రమపద్ధతిగా, జాగ్రత్తగా వాహనం నడపాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిబంధనలు పాటించడం వల్లే కుటుంబాలను రక్షించవచ్చని పేర్కొన్నారు.