నగరానికి ముంపు ముప్పు.. పరిష్కారమెన్నడో ?
నెల్లూరు నగరాన్ని ముంపు ముప్పు వెన్నాడుతోంది. ప్రతి ఏడాది ఆ తీవ్రత పెరుగుతూనే ఉంది. కొద్ది పాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే వర్షాల వేళ అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావిడి చేయడం, ఆ తర్వాత మిన్నకుండిపోవడం షరా మామూలైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు మేల్కోని పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని నగర ప్రజలు కోరుతున్నారు.