నూజివీడులో 'రేపు మీకోసం' కార్యక్రమం
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు 'మీకోసం' ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. మునిసిపల్ ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ వినూత్న ఇవాళ మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చు అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.