VIDEO: 'స్త్రీ శక్తి' పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ

సత్యసాయి: టీడీపీ అంటేనే మహిళా పక్షపాతి అని 'స్త్రీ శక్తి' పథకం ద్వారా అది మరోసారి నిరూపితమైందని హిందూపురం ఎంపీ పార్థసారథి తెలిపారు. ధర్మవరంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే 'స్త్రీ శక్తి' పథకం శుక్రవారం ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రయాణించే బస్సును జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు.