కర్రెగుట్టల్లో కాల్పులు.. మహిళా మావో మృతి

MLG: కర్రెగుట్టల్లో 'అపరేషన్ కగార్' కొనసాగుతోంది. 15 రోజులుగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావో మరణించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టు వద్ద 303 రైఫిల్‌ను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.