సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

సత్యసాయి: సంకటహర చతుర్థి సందర్భంగా మండలంలోని వివిధ ఆలయాల్లో బుధవారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బత్తలపల్లి, పోట్లమర్రి, సంఘమేశ్వర క్షేత్రం తదితర గ్రామాల్లోని వినాయకునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆకు పూజలు చేశారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ప్రతి ఏటా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని భక్తుల పేర్కొన్నారు.