నూతన వధూవరులను ఆశీర్వదించిన : ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలం, త్రిలోచనాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పసల రమేష్, కుమారుడు మహేష్ బాబు, వివాహం వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ వివాహ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సోమవారం వారి నివాసానికి విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.