గ్రెయిన్ మార్కెట్ ఆవరణలో తీజ్ వేడుకలు

JN: జిల్లా కేంద్రంలోని గ్రెయిన్ మార్కెట్ ఆవరణలో ఆదివారం రాత్రి తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వరంగల్ మాజీ జడ్పీ ఛైర్పర్సన్ లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రకృతిని ఆరాధించే పండుగ అయిన తీజ్‌ను తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించి, చివరి రోజు సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఊరేగించారు.