VIDEO: వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
NTR: తిరువూరు మండలం అక్కపాలెంలో శ్రీశ్రీశ్రీ నాభి శిలాంభ, పోతురాజు స్వామి, శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మమ్మ తల్లి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సోమవారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. తిరువూరు పరిసర ప్రాంతాలు నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.