అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

MDK: తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని ఎదుర్కోళ్ల కార్యక్రమం ఘనంగా చేపట్టారు. అనంతరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేపట్టారు. పూజారి ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.