పెదపారుపూడిలో 43.5 డిగ్రీల ఎండ

పెదపారుపూడిలో 43.5 డిగ్రీల ఎండ

కృష్ణా: వేసవి ఆరంభంలోనే ఎండలు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు ప్రమాద స్థాయికి చేరుతుండగా, పెదపారుపూడిలో గురువారం అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న వేళ బయటకు రావద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.