'ఆశాలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి'

'ఆశాలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి'

KMM: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో జరిగిన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడుతూ.. ఆశాలకు పని గంటలు తగ్గించి, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. తమ హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకోగలమని, అందుకు సీఐటీయూ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.