గ్రామంలో భక్తుల కోసం అన్నదాన సత్రం ప్రారంభం
GDWL: గట్టు మండలం బల్గెర గ్రామంలోని శ్రీ దిగంబరస్వామి దేవస్థాన ఆవరణలో శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గద్వాల జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జ్ బాసు హనుమంతు మంగళవారం ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.