'విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు'

KMM: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు తమ విధానాలను అవలంబిస్తున్నాయని,పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యరంగాన్ని కాపాడేందుకు అంతా కలిసి రావాలని కోరారు. ప్రభుత్వం తీరు మారాలని డిమాండు చేశారు.