ఒంటిమిట్ట కోదండ రాముడిని దర్శించుకున్న కలెక్టర్
కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంటిమిట్ట కోదండ రామస్వామిని దర్శించుకున్నారు. ఆయనకి శాస్త్రోత్తంగా ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.