యూరియాను అధిక ధరకు విక్రయించిన వ్యాపారిపై కేసు

NLG: దోమలపల్లిలో యూరియాను అధిక ధరకు విక్రయించిన శ్రీ కనకదుర్గ ఫర్టిలైజర్స్ యజమాని విగ్నేష్‌పై కేసు నమోదు చేశారు. MRP ₹266 ఉన్న యూరియా బస్తాను ₹350కు విక్రయించినట్టు వ్యవసాయ అధికారుల తనిఖీలో తేలింది. NLG రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు కాగా, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ హెచ్చరించారు.