గాలిగోపురం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల మండలం మీనాంబరం గ్రామంలోని పరశవేధిశ్వర స్వామి గాలిగోపురం (ముఖద్వారం) నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. ఆలయాలు మన ఆధ్యాత్మిక సంస్కృతిక వారసత్వానికి ప్రతికలు అని అన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.