ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సీపీఐ నాయకులు
MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.59 కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ సీపీఐ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్‌ను సన్మానించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యేకు పూలబొకేను అందించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి పరిష్కారం చూపాలని కోరారు.