శేష జీవితం కుటుంబ సభ్యులతో గడపాలి: ఎస్పీ
MDK: శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్ పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన హెడ్ కానిస్టేబుల్ సైదోద్దీన్ ఘన వీడ్కోలు పలికి, సన్మానం నిర్వహించారు. సైదోద్దీన్ ను శాలువాతో సత్కరించి, సన్మాన పత్రం, మెమెంటో అందజేశారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించి సైదోద్దీన్ మన్ననలు పొందారన్నారు.