లక్ష్మీదేవి అలంకారంలో విరుపాక్షి మారెమ్మ

లక్ష్మీదేవి అలంకారంలో  విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు.