డీఎస్పీ చంద్రయ్యను అభినందించిన న్యాయమూర్తి

SRCL: అదనపు ఎస్పీ డి. చంద్రయ్యను సోమవారం జిల్లా న్యాయమూర్తి నీరజ అభినందించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న సందర్భంగా జిల్లా న్యాయమూర్తి నీరజ కోర్టు ఆవరణలో అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాలని కోరారు.