పీజీ పరీక్ష ఫీజు గడువు పొడిగించాలని AISF వినతి
TPT: SVU పరిధిలో ఈ నెల 25 నుంచి పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఫీజు చెల్లించేందుకు సోమవారం చివరి తేదీగా నిర్ణయించారు. ఇంకా పలువురు విద్యార్థులు ఫీజు చెల్లించలేకపోతున్నారని AISF నాయకులు తెలిపారు. అందువల్ల గడువు తేదీని పొడిగించాలని రెక్టార్ అప్పారావు, డీన్ సురేంద్రకు వినతి పత్రం సమర్పించారు.