'మార్గదర్శులను గుర్తించాలి'
ASR: జిల్లాలో ఎక్కువ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి మార్గదర్శిలను గుర్తించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం, వీసీ నిర్వహించారు. బంగారు కుటుంబాలను, మార్గదర్శిలతో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు.