మల్లేపల్లిలో కార్పొరేటర్ సహాయక చర్యలు

HYD: నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మల్లేపల్లిలో కార్పొరేటర్ మహమ్మద్ జఫర్‌ఖాన్ సహాయక చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి వరద నీటిని తరలించేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులతో కలిసి మరమ్మతులు చేపట్టారు.