VIDEO: 'జాతి కోసం నాయకులు మారాలి'
VSP: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం LIC బిల్డింగ్ వద్ద ఆయన విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. పదవుల కోసం జాతిని తాకట్టు పెట్టే నాయకులు కాకుండా, జాతి కోసం పదవులను వదిలే నిజాయితీ గల నాయకులు కావాలన్నారు.