దుకాణంలో చోరీ.. రూ. 25 వేల నగదు అపహరణ
BHPL: కాటారం మండలంలో చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరాంపల్లి గ్రామంలోని రహదారి పై ఉన్న ఓ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి రూ. 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇవాళ దుకాణ యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది