ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి

EG: రాజమండ్రి రూరల్ ధవలేశ్వరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బత్తుల వెంకటరమణ (56) మృతి చెందారు. ఆయన రాజమండ్రి పోలీస్ స్టోర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం వేమగిరిలో విధులు నిర్వహించేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ధవలేశ్వరం పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.