'వైసీపీ నేత అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలి'
కోనసీమ: అమలాపురం నల్లవంతెన వద్ద వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ దళిత నాయకులు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ... అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.