సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్

సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్

కృష్ణా: సామాజిక బాధ్యతగా ప్రతి శనివారం సైకిల్ లేదా నడక ద్వారా కార్యాలయానికి రావాలని ఉద్యోగులకు ఇచ్చిన పిలుపుకు జిల్లా కలెక్టర్ బాలాజీ స్వయంగా ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కలెక్టర్ యథావిధిగా సైకిల్‌పై ప్రయాణించి కార్యాలయానికి చేరుకుని విధులకు హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, ఇంధన పొదుపు చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.