కర్నూలులో 16న తిరంగా ర్యాలీ

KRNL: ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణత్యాగాలు చేసిన సైనికులకు మద్దతుగా మే 16న భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. కూటమి నేతృత్వంలో జరిగే ఈ ర్యాలీలో అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.