మాల మహానాడు జిల్లా అధ్యక్షుడికి దళిత రత్న అవార్డు
KNR: జాతీయ మాల మహానాడు జిల్లాఅధ్యక్షుడు శంకర్‌కు ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డు లభించింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తారు. జిల్లా రామడుగు మండలం వెలిచాలకి చెందిన మాజీ సర్పంచ్ శంకర్, అనేక సంవత్సరాలుగా మాలల హక్కుల కోసం పోరాడుతున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో అవార్డు అందుకున్నారు.