తాటి చెట్టుపై నుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

KNR: సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏరుకొండ చంద్రమౌళి రాయికల్ గ్రామంలో తాడిచెట్టు పైకి ఎక్కి కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారీ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తొంటి ఎముక విరిగింది. గ్రామస్థుల సహాయంతో చంద్రమౌళిని స్థానిక ఆసుపత్రికి తరలించారని, చికిత్స అందుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.