జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

ADB: ఉద్యోగ అవకాశాలు ఇంటిపట్టునే లభించాలంటే కుదరదని బయటకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించినప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరడంతో పాటు జీవితంలో స్థిరపడొచ్చని ఎస్పీ గౌష్ ఆలం సూచించారు. ఆదిలాబాద్ సెంట్రల్ గార్డెన్లో సబ్ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో రక్షా సెక్యూరిటీస్ సర్వీస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ఎస్పీ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.