'మూఢనమ్మకాల పట్ల భయం వద్దు'

ADB: మూఢనమ్మకాల పట్ల భయం వద్దని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతల రవీందర్ పేర్కొన్నారు. ఇటీవల భీంపుర్ మండలంలోని పిప్పల్ కోటిలో పట్టపగలే రోడ్డుపై క్షుద్ర పూజలు కలకలం రేపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ దారి వెంట వెళ్లేందుకు భయాందోళన చెందడంతో వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సభ్యులు ఉన్నారు.