పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
E.G: మండపేట మండలం కేశవరం గ్రామంలోని గని పోతురాజు స్వామి ఆలయం ఎదురుగా ఉన్న పొలంలో సుమారు 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. మృతుడు నీలం రంగు టీషర్టు, నలుపు రంగు షార్ట్ ధరించి, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉందని రూరల్ పోలీసులు తెలిపారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.