ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
VZM: భారతదేశపు మొదటి, ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 108వ జయంతి పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ పురోగతికై జీవితాంతం పోరాడిన స్ఫూర్తిదాయక నాయకురాలు ఇందిరా గాంధీ అన్నారు.