'పిల్లలు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి'
AKP: పిల్లలు చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని ఎలమంచిలి ఎస్సై సావిత్రి సూచించారు. ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎర్రవరంలో నిర్వహించిన డ్వాక్రా మహిళల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.