నేడు నర్వ మండలంలో ఎమ్మెల్యే పర్యటన

NRPT: నర్వ మండలానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని పీఎసీఎస్ భవనంలో నూతనంగా నిర్మించిన దుకాణాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారని తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం 12 గంటలకు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు.