'మద్ది లింగయ్య సేవలు మరువలేనివి'

'మద్ది లింగయ్య సేవలు మరువలేనివి'

NLG: రైస్ మిల్లు డైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షులు, సీపీఎం సీనియర్ నాయకులు మద్ది లింగయ్య సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు అన్నారు. చిట్యాలలో ఇవాళ జరిగిన లింగయ్య మూడవ వర్ధంతి సభకు వారు హాజరై మాట్లాడారు. కడవరకు కార్మికుల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు.