నేటితో ముగియనున్న రాజ్ కసిరెడ్డి కస్టడీ

AP: YCP నేత రాజ్ కసిరెడ్డి, మరో ముగ్గురి కస్టడీ గడువు నేటితో ముగియనుంది. వారిని ACB కోర్టులో సిట్ అధికారులు హాజరుపర్చనున్నారు. లిక్కర్ స్కాంలో కసిరెడ్డి, పైలా దిలీప్, చాణక్య, సజ్జల శ్రీధర్ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు కసిరెడ్డి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. కసిరెడ్డి అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు.