పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించిన అడిషనల్ ఎస్పీ
చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.